: ఈజిప్టులో కాల్పులు... పరుగులు తీసిన పర్యాటకులు!


ఈజిప్టులోని పిరమిడ్ల వద్ద ఆగంతుకులు కాల్పులకు పాల్పడటంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద ఈరోజు ఈ సంఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై ఇక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు ఈ పనికి పాల్పడ్డారు. పర్యాటకుల బస్సుపైన, హోటల్ పైన వారు కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వారు పారిపోయారు. అయితే, ఈ సంఘటనలో పర్యాటకులందరూ క్షేమంగానే ఉన్నారని, బస్సు, హోటల్ స్వల్పంగా దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News