: బాలయ్య.. బంగారం కార్డులు!
బాలయ్య... బంగారం కార్డులు గురించి ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు తెగ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ దాని కథేమిటంటే.. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'డిక్టేటర్'లో హీరో పేకాట ఆడే దృశ్యం ఉంటుందట. ఆ సీన్ లో పేకముక్కలు కొంచెం రిచ్ గా కనపడితే బాగుంటుందని చిత్ర దర్శకుడు శ్రీవాస్ అనడంతో.. వెంటనే బంగారం కార్డులను బాలకృష్ణ తెప్పించారట. ఈ కార్డులతోనే బాలకృష్ణ పేకాట ఆడుతున్న దృశ్యాన్ని తెరకెక్కించారని ఫిల్మ్ నగర్ సమాచారం. అన్నట్టు, ఇంత ఖరీదైన కార్డులు తనకు గిఫ్ట్ గా వచ్చాయని బాలయ్య చెప్పారని సినీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.