: 26వేల పైకి బంగారం ధర
కొత్త ఏడాదిలో బంగారం ధర మరింత పైపైకి వెళుతోంది. మార్కెట్ లో ఇవాళ పసిడి ధర 26వేలు దాటింది. రూ.430 పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత ఉన్న 10 గ్రాముల బంగారం ధర రూ.26,330కి చేరింది. అటు వెండి ధర కూడా పెరిగింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి రూ.34,000కు చేరింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా బంగారం ధరపై దాని ప్రభావం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,100 అమెరికన్ డాలర్లకు చేరింది. రూపాయి మారకం విలువ తగ్గడంతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండు పెరగడం వల్ల దాని ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.