: మాస్ సినిమాకు కొత్త అర్థం చెప్పిన రానా!


మంచి మాస్ సినిమా ఒకటి చేయాలని కోరిన అభిమానికి, యుద్ధాన్ని మించిన మాస్ ఏముంది చెప్పు? అంటూ రానా తన కొత్త సినిమా గురించి చెప్పాడు. రానా చెప్పింది 'బాహుబలి 2' గురించి కాదు. తాజాగా తను నటిస్తున్న తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం గురించి. దమ్ మారో దమ్, బేబీ, బాహుబలి సినిమాల ద్వారా బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న రానా, తాజాగా 'ఘాజీ' సినిమాలో నటిస్తున్నాడు. 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా సముద్ర గర్భంలో కలిసిపోయిన భారత నౌక పీఎన్ఎస్ ఘాజీ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. దీంతో సరికొత్త అనుభవాన్ని సొంతం చేసుకోనున్నానని రానా తెలిపాడు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆయన అభిమానులు, స్నేహితులు ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News