: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు జీవోపై హైకోర్టు స్టే... ఎన్నికల గడువు పొడిగింపు


జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 15 రోజుల్లోగా ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల షెడ్యూల్ కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. అనంతరం ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరి 9 వరకు న్యాయస్థానం గడువు పొడిగించింది. ఈ క్రమంలో ఈ నెల 9లోగా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలంగాణ ఏజీ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారైన 31 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News