: అమరావతి నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది: బాలకృష్ణ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ మేరకు మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హిందూపురానికి తాగునీటి సమస్య ఏర్పడిందని ఆరోపించారు. హిందూపురం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బాలయ్య హామీ ఇచ్చారు.