: పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్రిక్తత


పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ (ఐఐఎఫ్టీ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంస్థకు ఛైర్మన్ గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ చాలా కాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆందోళనలు తీవ్రం కావడంతో గత నెలలో ఐఐఎఫ్టీకి సెలవు ప్రకటించారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ప్రచారం చేశాడన్న వంకతో ఆయనను ప్రతిష్ఠాత్మక సంస్థకు ఛైర్మన్ గా నియమించడం సరికాదని పేర్కొంటున్నారు. ఐఐఎఫ్టీకి సేవలందించేందుకు ఎందరో గొప్ప మేధావులుండగా గజేంద్ర చౌహాన్ ఏం సాధించారని ఆయనను ఛైర్మన్ గా నియమిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక సెలవులు ప్రకటించిన నాటి నుంచి విద్యార్థుల ఆందోళన తీవ్రమైంది. ఈ నేపథ్యంలో నేడు ఐఐఎఫ్టీ సిబ్బంది విధులకు హాజరుకాకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు.

  • Loading...

More Telugu News