: మహారాష్ట్రలోని వైద్య శిబిరానికి సల్మాన్ విరాళం


మహారాష్ట్రలోని జల్ గావ్ లో నిర్వహించనున్న వైద్య శిబిరం నిర్వహణ నిమిత్తం బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ రూ.2.5 కోట్ల విరాళం ప్రకటించాడు. కరవు ప్రాంతమైన జల్ గావ్ లో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరానికి జల్ గావ్ ప్రజలే కాకుండా, సమీప ప్రాంతాల వారు కూడా వైద్య సేవలు పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేన్సర్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు టాటా మెమోరియల్ ఆసుపత్రి వైద్య నిపుణులు హాజరుకానున్నారు. పలు ఫార్మా కంపెనీలు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్న ఈ వైద్య శిబిరాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News