: ఇకపై తెలంగాణలో హెలీ టూరిజం!
తెలంగాణలో ప్రకృతి అందాలను, హైదరాబాద్ మహా నగరాన్ని ఇకపై హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ప్రజలకు లభించనుంది. మహానగర శోభను వీక్షించడమే కాకుండా హెలికాఫ్టర్ లో ప్రయాణించామన్న సంతోషం ప్రజలకు చేరువయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం హెలీ టూరిజానికి నాంది పలకనుంది. హుస్సేన్ సాగర్- మానేరు డ్యాం, హుస్సేన్ సాగర్-శ్రీశైలం రిజర్వాయర్ కు హెలికాఫ్టర్ ట్రిప్స్ వేసేందుకు సీప్లేన్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ను సీప్లేన్ బృందం నేడు పరిశీలించనున్నట్లు సంబంధిత అధికారుల సమాచారం.