: కోడి పందేలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఏపీ ప్రభుత్వం


కోడి పందేల నిర్వహణ అంశంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కొన్నిరోజుల కిందట కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు కౌంటర్ దాఖలు చేసింది. కోడి పందేలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బెట్టింగులకు ఆవకాశం లేదని, ఇప్పటికే చర్యలు ప్రారంభించామని సర్కారు స్పష్టం చేసింది. ప్రభుత్వ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. మరోవైపు కోడిపందేల విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు.

  • Loading...

More Telugu News