: పూర్వీకుల ఊరిలో జమ్ముకశ్మీర్ సీఎం అంత్యక్రియలు


జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న బిజ్బెహారాలో సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇది ఆయన పూర్వీకుల ఊరు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్న ముఫ్తీ భౌతికకాయాన్ని ముందుగా శ్రీనగర్ లోని ఆయన స్వగృహానికి తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం కొన్ని గంటల పాటు అక్కడే ఉంచుతారు. తరువాత బిజ్బెహారాలో అంతిమయాత్ర నిర్వహిస్తామని, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పీడీపీ జనరల్ సెక్రటరీ రఫీ అహ్మద్ మీర్ తెలియజేశారు.

  • Loading...

More Telugu News