: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చంద్రబాబు హామీ
కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ అతిథిగృహంలో సీఎం చంద్రబాబును ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కలసి మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎంతో ఆయన చర్చించారు. తప్పకుండా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తరువాత అశోక్ బాబు మీడియాకు తెలిపారు. అంతేగాక ఉద్యోగులకు డీఏ, హెల్త్ కార్డుల జారీపై చర్చించామని చెప్పారు. ఉద్యోగులకు డీఏపై రెండు రోజుల్లో సీఎం తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అటు హెల్త్ కార్డులపై ఈ నెల 15వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం చెప్పినట్టు తెలిపారు.