: ఈ నెల 26న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలనుకుంటున్నాం: మంత్రి నాయిని
ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయనున్నట్టు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదు, చంచల్ గూడ జైలులో వార్షిక సదస్సుకు హాజరైన మంత్రి, ఏడాదిలో జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సుమారు 300 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు నాయిని వివరించారు. జైళ్ల శాఖలో సంస్కరణలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.