: ఒకే వేదికను పంచుకోనున్న భిన్న ధ్రువాలు !


ఒకే వేదికపై భిన్న ధ్రువాలు కనిపించనున్నారు. ఇంతకీ వారెవరంటే... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ నెల 8, 9 తేదీల్లో పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో బిజినెస్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి జైట్లీ, కేజ్రీ హాజరుకానున్నారు. కాగా, వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. జైట్లీ హయాంలోనే డీడీసీఏ లో అవకతవకలు జరిగాయని కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను జైట్లీ కొట్టి పారేశారు. తనపై తప్పుడు ప్రచారానికి ఆప్ నేతలు పాల్పడుతున్నారంటూ జైట్లీ పరువు నష్టం దావా కూడా వేశారు.

  • Loading...

More Telugu News