: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశాలో ఆందోళన... రైళ్లు, బస్సు రాకపోకలకు అంతరాయం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశాలో బీజేడీ పార్టీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రాయగఢలో రైళ్ల రాకపోకలను బీజేడీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దాంతో కోరాపూట్-విశాఖ ప్యాసింజర్ ను నిలిపివేశారు. అంతేగాక పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఆందోళనతో పార్వతీపురం-ఒడిశా మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. పార్వతీపురం-రాయగఢ, శ్రీకాకుళం-రాయగఢ, పార్వతీపురం-నారాయణపూర్ మధ్య బస్సు సర్వీసులను కేన్సిల్ చేశారు.