: సోనియాతో ముగిసిన వెంకయ్యనాయుడు భేటీ


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి భేటీ ముగిసింది. సోనియా నివాసంలో ఈరోజు ఉదయం ఆయన సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు, పెండింగ్ బిల్లులపై చర్చించినట్లు సమాచారం. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత చర్చల ఆధారంగా కాంగ్రెస్ తన వైఖరిపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ విషయమై పార్టీలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశాలు సజావుగా సాగాలంటే కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా వ్యవహరించాలన్న విషయాన్ని ప్రస్తావించానన్నారు. గతంలో కాంగ్రెస్ లేవనెత్తిన మూడు అంశాలపై ఆర్థికమంత్రి జవాబు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమెకు గుర్తుచేసినట్లు వెంకయ్యనాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News