: ఐఎస్ గురించి తెలియకపోతే మాట్లాడకు.. ఒవైసీకి హెచ్చరిక!
ఐఎస్ఐఎస్ గురించి తెలియకపోతే మాట్లాడవద్దంటూ ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఐఎస్ ను భూతంగా చూపిస్తూ ఒవైసీ చేస్తున్న వ్యాఖ్యలపై ఒకవేళ చర్చ కనుక నిర్వహిస్తే.. తాము అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేరంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంధకారంలో మగ్గుతున్న అసదుద్దీన్ కి దాని నుంచి బయటపడేందుకు అవసరమైన జ్ఞానాన్ని ఐఎస్ ఇస్తుందని ఆ ట్వీట్ లో ఉగ్రవాద సంస్థ పేర్కొంది. కాగా, ఐఎస్ ఉగ్రవాదులపై అసదుద్దీన్ గతంలో మండిపడ్డారు. రేపిస్టులు, హంతకులు ఐఎస్ లో ఉన్నారని, యువకులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.