: జమ్ముకశ్మీర్ సీఎం మృతిపట్ల ప్రముఖుల సంతాపం


అనారోగ్యంతో కన్నుమూసిన జమ్ముకశ్మీర్ సీం ముఫ్తీ మహ్మద్ సయీద్(79) కు పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. జమ్ముకశ్మీర్ కు, దేశానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయని రాష్ట్రపతి ప్రణబ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News