: కొడుకు చనిపోయాడని విలపిస్తూ తల్లి మృతి!
కొడుకు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఒక తల్లి విలపిస్తూ ఆమె కూడా ప్రాణాలు విడిచిన హృదయవిదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ఇల్లంతకుంటలో జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు (50) ఈరోజు మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి నాగమ్మ(70) బోరున విలపించింది. ఈ బాధను తట్టుకోలేకపోయింది. కొడుకు కోసం ఏడుస్తూనే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.