: నేటి నుంచి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్


ప్రతి ఏటా నిర్వహించే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తాజ్ కృష్ణ హోటల్ లో ఈరోజు సాయంత్రం ప్రారంభం కానుంది. ప్రధాన భాషగా మరాఠీని ఎంచుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న అరుదైన కళ కిన్నెర వాయిద్యానికి సాక్షిగా నిలిచిన దర్శనం మొగిలయ్య ప్రదర్శనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా, రేపటి నుంచి లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా సాహితీ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో పలువురు ప్రముఖ రచయితలు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News