: జమ్మూ, కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూత
జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. కొంతకాలంగా మెడనొప్పి, జ్వరంతో బాధపడుతున్న ముఫ్తీ మహ్మద్ సయీద్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గత పదిరోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్ పైన ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఆయన ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, ముఫ్తీ మహ్మద్ సయీద్ 2015లో జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.