: నేతలకు సోషల్ మీడియా పాఠాలు.. అమ్మ సర్కారు నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో సామాజిక మాధ్యమాల వాడకం విరివిగా పెరిగిన నేపథ్యంలో తమిళనాడులో అమ్మ సర్కారుగా పేరొందిన ఏఐఏడీఎంకే తమ పార్టీ నేతలకు సోషల్ మీడియా పాఠాలు బోధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 9 నుండి 26 వరకూ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్, ట్విట్టర్ మొదలైన వాటిపై శిక్షణను అందించి, ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. త్వరలో రాబోయే ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాలను పార్టీనేతలంతా సమర్థవంతంగా వినియోగించాలని ఇప్పటికే సీఎం జయలలిత పిలుపునిచ్చారు.