: నన్ను నిర్లక్ష్యం చేసినందుకే బీజేపీ ఓడిపోయింది: శత్రుఘ్నసిన్హా
సొంత పార్టీపై ఒకసారి పొగడ్తలు, మరోసారి విమర్శలతో చెలరేగిపోయే బీజేపీ నేత, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా తాజాగా బీజేపీ తనను నిర్లక్ష్యం చేసినందునే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రుఘ్నసిన్హా తన ఆత్మకథ 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ తనను, అక్కడి కొంతమంది నాయకులను పట్టించుకోనందునే ఘోర ఓటమిపాలయ్యిందని వ్యాఖ్యానించారు. బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో శత్రుఘ్నసిన్హా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.