: వ్యక్తిగతంగా రామలింగయ్య గారికి వీరాభిమానిని: చిరంజీవి
సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా అల్లు రామలింగయ్య అంటే తనకు మహా ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య ఒక గొప్ప నటుడన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అల్లు రామలింగయ్యకు అల్లుడిని అయిన తర్వాత వ్యక్తిగతంగా మరింత దగ్గరయ్యానని, ఆ తర్వాత ఆయనకు వీరాభిమానినయ్యానని చెప్పారు. అల్లు రామలింగయ్య కమ్యూనిజం భావాలను ఒంటపట్టించుకున్న వ్యక్తి అని, స్వాంతంత్ర్యోద్యమంలో పాల్గొని తన దేశభక్తి చాటుకున్నారన్నారు. అంటరానితనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారని, ఊరు చివర నివసించే వారితో కలిసి కూర్చుని భోజనం చేసిన మానవతావాది రామలింగయ్య అని అన్నారు.