: అల్లురామలింగయ్య, రాఘవేంద్రరావుల అనుబంధం విడదీయరానిది: చిరంజీవి
'రామలింగయ్యగారికి, మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు దర్శకుడు కె.రాఘవేంద్రరావు' అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అల్లురామలింగయ్య జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘ అల్లు రామలింగయ్యతో అనుబంధాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వ్యక్తి ఆయన. రామలింగయ్య మనస్సుకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి రాఘవేంద్రరావు. ఈ పురస్కారం ఆయనకు ఇవ్వడం ఎంతో గౌరవం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో రామలింగయ్య నటించని చిత్రాలు చాలా తక్కువ. వారిద్దరూ సినిమా సెట్స్ లో చాలా సరదాగా ఉంటారు. అంతేకాదు, రాఘవేంద్రరావుకు వైద్యుడు కూడా అల్లునే. వాళ్లది విడదీయరాని అనుబంధం’ అని చిరంజీవి పేర్కొన్నారు.