: అల్లు రామలింగయ్య గొప్ప మానవతావాది: పరుచూరి వెంకటేశ్వరరావు


‘డబ్బు ఎక్కువైతే నటన మీద వ్యామోహం పోతుందేమోనని’ అల్లు రామలింగయ్య తమతో అంటుండే వారని ప్రముఖ మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య గొప్ప మానవతావాది, గొప్పనటుడు, పరోపకారి అని, ఎన్నో గొప్ప చిత్రాల్లో ఆయన నటించారని అన్నారు. ఈ పురస్కారాన్ని దర్శకుడు రాఘవేంద్రరావుకు ప్రదానం చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News