: మయన్మార్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ తీసుకున్న జెట్ ఎయిర్ వేస్ విమానం
భారత్ కు చెందిన జెట్ ఎయిర్ వేస్ విమానం మయన్మార్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ టెర్మినస్ నుంచి 184 మంది ప్రయాణికులతో బయల్దేరిన జట్ ఎయిర్ వేస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గమనించిన పైలట్ బ్యాంకాక్ మీదుగా వియత్నాం వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ బోయింగ్ 737 విమానాన్ని మయన్మార్ లోని యాంగన్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీనిపై మయన్మార్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరమ్మతుల అనంతరం అది గమ్యం చేరుకోనుంది.