: రాఘవేంద్రరావుకు ‘అల్లు’ జాతీయ పురస్కారం ప్రదానం
అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం- 2015 ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అందజేశారు. తొలుత రాఘవేంద్రరావుకు దుశ్శాలువా కప్పి, స్వర్ణ కంకణం, స్వర్ణ కిరీటంతో ఆయన్ని సత్కరించి సన్మానపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు శిరీష్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు వాసిరాజు ప్రకాశం తదితరులు హాజరయ్యారు.