: 50 ఏళ్ల క్రికెట్ చరిత్రలో లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్సే ఆణిముత్యం!


గత 50 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ టెస్టు ఇన్నింగ్స్ ను ఆణిముత్యంలా భావించవచ్చు? అంటూ ప్రముఖ క్రీడా టెలివిజన్ ఛానెల్ ఈఎస్పీఎన్ ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మాజీ టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ ఆణిముత్యంగా నిలిచింది. కోల్ కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికపై 2001లో ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులు అత్యుత్తమమైనవని ముక్తకంఠంతో పేర్కొన్నారు. గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, డేవిడ్ బూన్, ఇయాన్ బోథమ్, లారా, పాంటింగ్, గవాస్కర్, సచిన్, ద్రవిడ్, గంగూలీ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా, వారి అద్భుత ఇన్నింగ్స్ లను తోసిరాజని లక్ష్మణ్ భారత్ ను విజేతగా నిలిపిన 281 పరుగులే అత్యుత్తమమని మాజీ దిగ్గజాలు, క్రీడాభిమానులు, విశ్లేషకులు, నిపుణులు పేర్కొన్నారు. ఆ టెస్టులో లక్ష్మణ్ తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులు చేయగా, పేలవ ఆటతీరుతో టీమిండియా ఫాలో ఆన్ లో పడింది. దీంతో జూలు విదిల్చిన లక్ష్మణ్ రెండో ఇన్నింగ్స్ లో 281 పరుగులతో ఆసీస్ ను చిత్తు చేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ ఇన్నింగ్స్ గత 50 ఏళ్ల టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News