: కాలుష్యం శాతాన్ని చెప్పే ‘హెల్ప్ చాట్’ !


మనం ఉండే ప్రదేశంలో కాలుష్యం శాతం ఎంత ఉందో చెప్పేందుకు ఒక మొబైల్ యాప్ ను కర్ణాటక వాసి అంకుర్ సింగ్లా రూపొందించాడు. ‘హెల్ప్ చాట్’ అనే ఈ మొబైల్ యాప్ ను మన దేశంలోని 40 నగరాల్లో ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తో బాటు, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఈ యాప్ కు అందుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సున్నా నుంచి 500+ వరకు సూచించే ఈ యాప్ కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తుంది. ఈ సందర్భంగా అంకుర్ సింగ్లా మాట్లాడుతూ, దేశ ప్రజల కోసం ఈ యాప్ ను రూపొందించానని, కాలుష్యం బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News