: గ్రానైట్ వ్యాపారిని విడిచిపెట్టేందుకు రూ.2కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు!
చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన ఒక గ్రానైట్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. హైడ్రామా అనంతరం ఆయన్ని విడిచిపెట్టారు. తమిళనాడులోని పరిమి నుంచి యాదమర్రికి వస్తుండగా కొందరు దుండగులు భజలింగంను అపహరించుకుపోయారు. ఆయన్ని విడిచిపెట్టాలంటే తమకు రూ.2 కోట్లు ఇవ్వాలని అతని కుటుంబసభ్యులను డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు ఇచ్చేందుకు వారు అంగీకరించి ఆ మొత్తాన్ని ఇవ్వడంతో భజలింగాన్ని చిత్తూరు జిల్లాలో ఉన్న మొగిలి వద్ద కారుతో పాటు విడిచిపెట్టి వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై గస్తీ కాస్తున్న పోలీసులకు భజలింగం కనిపించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.