: రాజేష్ ఖన్నాపై పోటీచేయడం చాలా బాధనిపించింది: శత్రుఘ్నసిన్హా
బీజేపీ నేత, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా తన రాజకీయ జీవితం తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. 1991లో బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నాపై ఢిల్లీలో పోటీ చేయడం తనకు ఎంతో విచారాన్ని కల్గించిందన్నారు. ఖన్నాను కలిసి తాను క్షమాపణలు కూడా చెప్పానని శత్రుఘ్నసిన్హా గుర్తు చేసుకున్నారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ అంటే తనకెంతో గౌరవమని, తన మార్గదర్శకుడు, గురువు అయిన ఆయన చెప్పిన మాటను కాదనలేకనే ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ తరపున నిలబడిన రాజేశ్ ఖన్నాపై పోటీ చేసిన శత్రుఘ్న సిన్హా నాడు ఓటమిపాలయ్యారు.