: ముంబై కుర్రాడు ప్రణవ్ ధన్ వాడేకు ఎంసీఏ స్కాలర్ షిప్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1009 పరుగులతో నాటౌట్ గా నిలిచి అరుదైన రికార్డు నమోదు చేసిన ముంబై కుర్రాడు ప్రణవ్ ధన్ వాడేకు ఎంసీఏ (ముంబై క్రికెట్ అసోసియేషన్) స్కాలర్ షిప్ ప్రకటించింది. అతనికి నెలకు రూ.10వేల చొప్పున ఐదు సంవత్సరాల పాటు (అంటే 2016 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు) ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. అంతేగాక అతని చదవుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని ఎంసీఏ తెలిపింది.