: ప్రపంచాన్ని వణికించిన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు...పలు దేశాల సమావేశాలు


ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించిందన్న వార్త ప్రపంచాన్ని వణికిస్తోంది. తమ హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమైందని, ప్రపంచమంతా తమ అణుశక్తిని వీక్షిస్తోందని, తమ దేశ భద్రత తమకు ముఖ్యమని, దీంతో తమ సైనిక సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ యన్ ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రయోగం తీవ్రత భూకంప లేఖినిపై 5.1 గా నమోదైందని అమెరికా భూవిజ్ఞాన సర్వే సంస్థ తెలిపింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన దక్షిణ కొరియా... అసలవి హైడ్రోజన్ బాంబు పరీక్షలేనా? అన్న కోణంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దీనిపై అమెరికా, జపాన్ దేశాలు కూడా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేస్తూ యూఎన్ ను హెచ్చరించాయి. దీంతో యూఎన్ కూడా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. తాజా పరీక్షలతో ఉత్తర కొరియా మూడు ప్లుటోనియం ఆధారిత ఆయుధపరీక్షలు నిర్వహించింది. ఇవి భారీ విధ్వంసాన్ని కలుగజేసేవి కావడం విశేషం. హైడ్రోజన్ బాంబు పరీక్షతో తాము అత్యున్నత అణుశక్తి దేశంగా ఆవిర్భవించామని ఆ దేశం చేసిన ప్రకటన అందర్నీ ఆందోళనలోకి నెట్టింది.

  • Loading...

More Telugu News