: నా రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు: చంద్రబాబు


కర్నూలు జిల్లా గోస్సాడు మండలం దీబగుంట్ల గ్రామంలో నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చాలా ఆగ్రహంతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని తెలిపారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచానని, తమ పార్టీ నేతలు అవినీతికి పాల్పడకుండా అడ్డుకట్ట వేశానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న చంద్రబాబు, ప్రజలు నమ్మారు కాబట్టే తమకు అధికారం కట్టబెట్టారని తెలిపారు. నేర చరిత్ర ఉన్నవారు చెబితే తాము వినాలా? అంటూ వైసీపీ నేతలను పరోక్షంగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధంలేని స్కాముల్లో సీఎం, మంత్రులను ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుపడేలా ఉందని, తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో అలాంటి సంఘటన ఎన్నడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. అవినీతి నేతల పాలనలో రాయలసీమ వెనుకబడిపోయిందని, సీమను అభివృద్ధి బాట పట్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News