: అఖిల్ కి కుర్తా సెలెక్ట్ చేసిన రకుల్...రకుల్ కి చీర సెలెక్ట్ చేసిన అఖిల్
హైదరాబాదు శివారుల్లోని అత్తాపూర్ లో సినీ తారలు సందడి చేశారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను సినీ నటుడు అక్కినేని అఖిల్, నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు వివిధ రకాల ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ సందర్భంగా అఖిల్ కు కుర్తా పైజామాను రకుల్ ఎంపిక చేయగా, రకుల్ ప్రీత్ సింగ్ కు అఖిల్ చీరను సెలెక్ట్ చేశాడు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్, రకుల్ రాక వార్త తెలిసిన అభిమానులు భారీ సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నటీనటులను చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. వారిని ఉత్సాహపరుస్తూ వారిద్దరూ అభిమానులకు అభివాదం చేశారు.