: జుట్టు, ఒళ్లు కనిపించకూడదు: గాంబియా దేశ ప్రజలకు ఆదేశాలు
ఈ మధ్యే ముస్లిం దేశంగా ప్రకటించుకున్న గాంబియా దేశం మహిళపై ఆంక్షలు విధించింది. 90 శాతం ముస్లిం ప్రజలు కలిగిన ఆఫ్రికా దేశం గాంబియా గత డిసెంబర్ లో ముస్లిం దేశంగా ప్రకటించుకుంది. ఇలా ప్రకటించుకున్న కొద్ది రోజులకే ప్రజల కోసం సరికొత్త నియమావళిని రచించింది. అందులో భాగంగా మహిళలపై ఆంక్షలు విధించింది. వాటిల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీల్లో పని చేసే మహిళలు జుట్టు కనిపించేలా వస్త్రధారణ ఉండకూడదని స్పష్టం చేసింది. జుట్టు కచ్చితంగా కప్పి ఉంచాలని పేర్కొంది. అలాగే శరీరం కనిపించకుండా వస్త్రధారణ చేసుకోవాలని ఆంక్షలు విధించింది. కాగా, ఈ ఆఫ్రికా దేశంలో కేవలం 20 లక్షల మంది జనాభా ఉంది. ఇందులో 90 శాతం మంది ముస్లింలు.