: కాంగ్రెస్ నుంచి అజిత్ జోగి కుమారుడు బహిష్కరణ


ఛత్తీస్ గఢ్ పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగీపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ టేప్ కాంట్రవర్సీ వ్యవహరంలో ఆయనపై ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. 2014, సెప్టెంబర్ 13న అంటానగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ జతకట్టాయన్న వార్తల నేపథ్యంలో కొన్ని రోజుల కిందట ఆయనకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అమిత్ జోగి ప్రస్తుత రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ తో భేటీ అయిన ఆడియో టేపులను ప్రముఖ దినపత్రిక విడుదల చేయడంతో రాజకీయ దుమారం రేగింది.

  • Loading...

More Telugu News