: అభిమానులు జీవితంలో ఓ భాగం: అమితాబ్ బచ్చన్
సినీ నటుల జీవితంలో అభిమానులు ఓ భాగమని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తెలిపారు. వజీర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభిమానులు లేకపోతే నటులు లేరని అన్నారు. ప్రతి నటుడుకి అభిమానులే ఎనర్జీ అని పేర్కొన్నారు. నటుడుకి సెలబ్రిటీ స్థాయి, అంతులేని ఆదరణ లభించడం సర్వసాధారణమని, అందులో ప్రత్యేకత ఏమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. పలు సందర్భాల్లో అభిమాన నటులను చూసిన అభిమానులు వారితో ఫోటోలు, సెల్పీలు దిగాలని ఆశపడతారని, అలాంటి సమయాల్లో వారి పట్ల శ్రద్ధ చూపడం నటుల కనీస బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు, పలు సందర్భాల్లో అభిమానులు తనతో ఫోటో దిగాలని భావిస్తారని, వారి అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని ఆయన చెప్పారు. సెలబ్రిటీలు అనుభవిస్తున్న హోదా, అభిమానం, ఆదరణ వారిచ్చినవేనని, అలాంటప్పుడు ఆ మాత్రం బాధ్యత చూపడం నటుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.