: రెజీనా స్టెప్పులు...యువత కేరింతలు!
సినీనటి రెజీనా స్టెప్పులేసి కేక పుట్టించింది. ఇదంతా దగ్గరగా చూస్తున్న అభిమానులు, యువకులు కేరింతలు కొట్టారు. కడపలోని కోటిరెడ్డి కూడలి వద్ద ఈరోజు ఒక దుకాణం ప్రారంభోత్సవానికి రెజీనా హాజరైంది. ఈ అందాల హీరోయిన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చారు. ఆ దుకాణంలోని రెండో అంతస్తు నుంచి రెజీనా చేతులూపుతూ అభిమానులను పలకరించి...నాలుగు స్టెప్పులేసి సందడి చేసింది. యువకులు సంతోషంతో చప్పట్లు కొట్టి, ఈలలు వేయడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.