: ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయుడే పాఠం చదవలేకపోయాడు!


ఇంగ్లీషు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడే ఆ పాఠం చదువలేని దురదృష్టకర పరిస్థితి అనంతపురం జిల్లాలోని ఒక పాఠశాలలో చోటుచేసుకుంది. తాడిమర్రు మండలంలోని ఏకపాదంపల్లిలోని పాఠశాలను ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి. సిశోడియా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ఆంగ్లబోధకుడు సర్దార్ బాబు బోధిస్తున్న తరగతికి ఆయన వెళ్లారు. ఆంగ్ల పాఠాన్ని చదవాల్సిందిగా సదరు ఉపాధ్యాయుడిని సిశోడియా ఆదేశించారు. ఆ పాఠాన్ని సర్దార్ బాబు చదవలేకపోవడంతో ఆ అధికారి ఆగ్రహించారు. ‘మీరే ఆంగ్ల పాఠం చదవలేని పరిస్థితిలో ఉంటే, ఇక విద్యార్థులకేమి బోధిస్తారు?’అని ప్రశ్నించారు. వెంటనే సర్దార్ బాబును తక్షణం సస్పెండ్ చేయాలంటూ విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News