: టీఆర్ఎస్ అలసత్వం వల్లే హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉనికిలోకి వచ్చింది: కేంద్ర మంత్రి
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం అహిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్కారు అలసత్వం వల్లే హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉనికిలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లే యువత తీవ్రవాదం పట్ల ఆకర్షితులవుతున్నారని ఆరోపించారు. దేశమంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గౌరవిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం నిజాంను పొగుడుతున్నారని హన్స్ రాజ్ ఎద్దేవా చేశారు.