: డాక్టర్ కత్తి ఆనంద్ ప్రాసిక్యూషన్ కు బాబు సర్కారు అనుమతి


అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ కత్తి ఆనంద్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏపీ సర్కారు అనుమతించింది. 2013లో ఆనంద్ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. ఆపై వచ్చిన రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆయనపై తదుపరి విచారణను నిలిపివేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును తిరగదోడాలని నిర్ణయించుకున్న అనిశా అధికారులు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నాడు.

  • Loading...

More Telugu News