: ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షను ఖండించిన అమెరికా
ఉత్తర కొరియా చేపట్టిన హైడ్రోజన్ బాంబు పరీక్షను అమెరికా ఖండించింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఆ దేశం ఉల్లంఘించిందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్టు ధ్రువీకరించలేకపోతున్నామని అభిప్రాయపడింది. ఐరాస తీర్మానం ప్రకారం ఉత్తర కొరియా ఎటువంటి అణు పరీక్షలు లేదా క్షిపణి పరీక్షలు కానీ చేయరాదు. మరోవైపు కొరియా మాత్రం అమెరికా లక్ష్యంగానే హైడ్రోజన్ బాంబు పరీక్షించినట్టు తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా దగ్గర భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయని, అందుకే ఆత్మరక్షణ కోసమే బాంబు పరీక్షలు జరిపినట్టు ఉత్తర కొరియా పేర్కొంది.