: ల్యాండింగ్ సమయంలో పేలిన విమానం టైరు... భోపాల్ లో తప్పిన ముప్పు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదమే తప్పింది. 95 మంది ప్రయాణికులతో భోపాల్ చేరిన ఎయిర్ ఇండియా విమానానికి ఎయిర్ పోర్టు అధికారులు ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటిదాకా ప్రయాణికులను సురక్షితంగా అక్కడకు చేర్చిన విమానం ల్యాండవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. రన్ వేను తాకగానే విమానం టైరు పేలిపోయింది. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. టైరు పేలిపోయిన నేపథ్యంలో పెద్ద శబ్దంతో పాటు విమానం కుదుపులకు గురి కావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో బతుకు జీవుడా అంటూ విమానం దిగేశారు.