: నలుగురు ఐఐఎఫ్టీయన్లకు రూ. కోటికి మించిన ప్యాకేజీ!


న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ)కి చెందిన నలుగురు విద్యార్థులకు ఎంఎన్సీ సంస్థలు రూ. కోటికి మించిన ప్యాకేజీలను ఆఫర్ చేశాయి. ఈ విషయాన్ని ఐఐఎఫ్టీ అధికారులు వెల్లడించారు. మొత్తం 254 మందికి ఐదు రోజుల్లో ప్లేస్ మెంట్స్ లభించాయని, ఈ సంవత్సరం 100 శాతం ప్లేస్ మెంట్ సాధించామని ఓ అధికారి తెలిపారు. దేశవాళీ సంస్థలు ఆఫర్ చేసిన ప్యాకేజీల్లో 21 శాతం పెరుగుదల నమోదు కాగా, సగటున రూ. 29 లక్షల వేతన ఆఫర్లు విద్యార్థులకు లభించాయని, మొత్తం మీద రూ. 18.01 లక్షల సరాసరి ప్యాకేజీలు విద్యార్థుల ముందున్నాయని తెలిపారు. గత సంవత్సరం 13 అంతర్జాతీయ కంపెనీలు సెలక్షన్స్ కు రాగా, ఈ యేడు ఆ సంఖ్య 15కు పెరిగిందని వివరించారు. అమేజాన్, గోల్డ్ మన్ సాక్స్, కాగ్నిజెంట్ జేపీ మోర్గాన్, ఎస్బీఐ, విప్రో, హెచ్సీఎల్ వంటి కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో పాల్గొన్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News