: అమెరికాలో చేయట్లా? మగాళ్లు వంట నేర్చుకోండి: చంద్రబాబు
ఇంట్లో ఆడవాళ్లు పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు మగవారే వంట చేయాలని, వంటెలా చేయాలో నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ, తేలికగా వంట పని పూర్తయ్యేందుకు తాము చాలినంత వంట గ్యాస్ ను సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. అమెరికాకు వెళ్లిన మనవారు అక్కడ వంటలు కూడా చేసుకుంటారని, ఇక్కడ మాత్రం పెత్తనం చేయాలని అనుకుంటున్నారని చమత్కరించారు. ఇంట్లో వంట చేయడం తమకు ఇష్టం లేదని చెప్పేవారు ఎవరున్నారో చేతులు ఎత్తాలని ముఖ్యమంత్రి అడిగిన వేళ సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఈ ఆసక్తికర ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది.