: ఒత్తిడిలోనూ కాస్తంత రిలీఫ్... ‘వజీర్’ సినిమా చూసి ఎంజాయ్ చేసిన కేజ్రీ!


ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టెన్షన్ లోనూ కాస్తంత రిలీఫ్ గా ఫీలయ్యారు. డీడీసీఏ కుంభకోణం నేపథ్యంలో ఆయనపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావా నిన్న పటియాలా హౌస్ కోర్టులో విచారణకు వచ్చింది. నేరుగా కోర్టుకు వెళ్లిన జైట్లీ... కేజ్రీ, ఆయన పార్టీ నేతలపై కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఇంత పెద్ద తంతు కోర్టులో నడుస్తోంటే, కేజ్రీ మాత్రం నిన్న బాలీవుడ్ చిత్రం ‘వజీర్’ చూస్తూ ఎంజాయ్ చేశారు. చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన పర్హాన్ అఖ్తర్, అదితీ రావ్ హైదరీలతో పాటు చిత్ర నిర్మాత విదూ వినోద్ చోప్రా, రచయిత అభిజిత్ జోషిలతో కలిసి ఢిల్లీలోని పీవీఆర్ మాల్ లోని ‘డైరెక్టర్స్ కట్’లో తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనకు కేజ్రీ హాజరయ్యారు. ఈ చిత్రం ఎల్లుండి దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News