: ఏలూరులో ఆపరేషన్ పిగ్ హంట్... స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే బుజ్జి
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆపరేషన్ పిగ్ హంట్ ముమ్మరంగా కొనసాగుతోంది. నగరంలో స్వైర విహారం చేస్తున్న పందుల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక పందుల కారణంగా నగరంలో పలు వ్యాధులు సంక్రమిస్తున్నాయని నగర జనం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పందుల నిర్మూలనకు ఏలూరు కార్పొరేషన్ అధికారులు ‘ఆపరేషన్ పిగ్ హంట్’ పేరిట సరికొత్త చర్యలు చేపట్టారు. వీధుల్లో కనిపించే పందులపై కర్రలతో దాడి చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే చంపేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో టీడీపీ సీనియర్ నేత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) స్వయంగా పాలుపంచుకున్నారు. పందులను కర్రలతో కొట్టి చంపుతున్న దృశ్యాలు తెలుగు టీవీ చానెళ్లలో కలకలం రేపుతున్నాయి.