: విశాఖలో మావోల ఘాతుకం!... టీడీపీ యువ నేత దారుణ హత్య
విశాఖ మన్యంలో నిషేధిత మావోయిస్టులు పేట్రేగిపోతున్నారు. మొన్నటికి మొన్న అధికార టీడీపీకి చెందిన ముగ్గురు గిరిజన నేతలను అపహరించిన మావోలు, కొన్ని రోజుల తర్వాత వారిని విడుదల చేశారు. తాజాగా అదే పార్టీకి చెందిన యువ నేతను దారుణంగా హతమార్చారు. విశాఖ జిల్లాలోని జీకేవీధి మండలం జెర్రెల్లలో నిన్న ఈ ఘటన కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరమణ టీడీపీకి కీలక నేతగా ఉన్నారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో వెంకటరమణ ఇంటిపై మావోయిస్టులు మూకుమ్మడి దాడి చేశారు. ఇంటిలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన మావోలు అతని తల్లిదండ్రులను కూడా చితకబాదారు. ఆ తర్వాత వెంకటరమణను దారుణంగా హతమార్చారు.